ఒక సాధారణ రోజు… కానీ నాకు మాత్రం ఒక చిన్న గుర్తు
Normal Day in My Life
ఉదయం లేచిన వెంటనే కొన్నిసార్లు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజు ఆ పని పూర్తి చేయాలి, ఎప్పటినుంచో అనుకుంటున్న మరో పనిని కూడా మొదలుపెట్టాలి అని ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.
కానీ అన్ని రోజులూ అలా ఉండవు కదా!
ఈరోజు నాకు కూడా ఏ పని మొదలుపెట్టాలన్నా పెద్దగా ఉత్సాహం అనిపించలేదు.
అలసిపోయానా అంటే అదీ కాదు. ఏదో పని చేయాలని ఉంది. కానీ ఏది ముందుగా చేయాలో నిర్ణయించుకుని మొదలుపెట్టాలంటేనే కొంచెం బద్ధకంగా అనిపించింది.
ఈరోజు పెద్దగా ఏమీ చేయలేనేమో! అనుకున్నాను.
కానీ ఉదయం అలా అనుకున్నంత మాత్రాన రోజంతా అలాగే గడిచిపోలేదు.
పని మొదలుపెట్టాక రోజు ఎలా గడిచిపోయిందో తెలియలేదు
కొద్దిసేపటి తర్వాత మామూలుగానే పనులు మొదలయ్యాయి.
ఒక పని చేస్తుండగా ఇంకొకటి గుర్తొచ్చింది. అది చూసుకునేలోపు మరో చిన్న పని చేయాల్సి వచ్చింది. మధ్యలో ఆగిపోయిన పనిని మళ్లీ మొదలుపెట్టాను.
ఇలా ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్లాను.
రోజు మొదట్లో అనుకున్న పెద్ద పనులన్నీ పూర్తయ్యాయని కాదు. కానీ ఏమీ చేయకుండా కూర్చున్నానని కూడా కాదు.
అలా చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది.
ఈరోజు నేను అసలు ఏం చేశాను? A Normal Day
సాయంత్రం కాసేపు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది.
ఈరోజు నేను అసలు ఏం చేశాను?
ఉదయం అనుకున్న పనుల్లో కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయి. కొత్తగా మొదలుపెట్టాలనుకున్న పని కూడా పూర్తిగా ముందుకు వెళ్లలేదు.
అందుకే రోజంతా ఏదో చేస్తూనే ఉన్నా, చివరికి పెద్దగా ఏమీ సాధించలేదన్న భావన కలిగింది.
కానీ కొద్దిసేపు ఆలోచించిన తర్వాత నాకు మరో విషయం గుర్తొచ్చింది.
మనం రోజూ చేసే పనులన్నింటికీ బయటికి కనిపించే ఫలితం ఉండదు.
ఒక గదిని శుభ్రం చేస్తే మార్పు కనిపిస్తుంది. ఒక వంటకం తయారు చేస్తే అది కనిపిస్తుంది.
కానీ ఏ పని ముందుగా చేయాలో నిర్ణయించడం, మధ్యలో వచ్చిన మరో అవసరాన్ని చూసుకోవడం, ఆగిపోయిన పనిని మళ్లీ మొదలుపెట్టడం… వీటన్నింటికీ ప్రత్యేకంగా కనిపించే గుర్తులు ఉండవు.
అయినా వాటికి మన సమయం, శ్రద్ధ ఖర్చవుతాయి.
కొన్నిసార్లు మనం పూర్తి చేసిన పనులను కాకుండా, ఇంకా మిగిలిపోయిన పనులను మాత్రమే గుర్తుపెట్టుకుంటాం.
అందుకేనేమో ఆ రోజు ఏం చేశామన్న ప్రశ్నకు వెంటనే సమాధానం దొరకదు.

అప్పుడు నా ఆలోచన కొద్దిగా మారింది
ఆ రోజు జరిగిన పనులను ఒక్కొక్కటిగా గుర్తుచేసుకున్నాను.
కొన్ని పూర్తయ్యాయి. కొన్ని మొదలుపెట్టాను. మరికొన్ని మధ్యలో ఆగిపోయాయి.
అంటే నేను అనుకున్నంతగా అన్నీ పూర్తికాలేదు. కానీ రోజు మొత్తం వృథా కూడా కాలేదు.
ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించకపోవడం వల్లనే నాకేమో అసంతృప్తిగా అనిపించింది.
అందుకే ఒక చిన్న విషయం నాకు గుర్తుండిపోయింది.
రోజు చివర్లో చేయలేకపోయిన పనుల లెక్క మాత్రమే కాకుండా, నిజంగా చేసిన పనులను కూడా ఒకసారి గుర్తుచేసుకోవాలి.
అలాగని ప్రతి చిన్న పనినీ పెద్ద విజయంగా భావించాల్సిన అవసరం లేదు.
ఏం పూర్తయింది, ఏది ఇంకా మిగిలింది అని స్పష్టంగా తెలుసుకుంటే చాలు. అప్పుడు మరుసటి రోజు ఏం మొదలుపెట్టాలో కూడా కొద్దిగా అర్థమవుతుంది.
ప్రతి రోజునీ ఒకేలా చూడలేం(A Normal Day)
కొన్ని రోజులు అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి.
మరికొన్ని రోజులు ఒక పని చేయడానికే ఎక్కువ సమయం పట్టవచ్చు. మధ్యలో వచ్చే అవసరాలు, మనసు పరిస్థితి, ఇంట్లోని బాధ్యతలు అన్నీ రోజును ప్రభావితం చేస్తుంటాయి.
అందుకే ఒక రోజు చాలా బాగా గడిచిందని మరుసటి రోజు కూడా అంతే చేయగలమని అనుకోలేం.
అలాగే ఒకరోజు మనం అనుకున్నంత పని చేయలేకపోయామని మన సామర్థ్యాన్నే సందేహించాల్సిన అవసరం లేదు.
అయితే చేయాల్సిన పనులన్నీ వదిలేయడం కూడా సమాధానం కాదు.
మిగిలిన వాటిలో ఏది నిజంగా ముఖ్యమో చూసుకుని, దాన్ని తర్వాత ఎప్పుడు చేయాలో నిర్ణయించుకోవచ్చు.
అలా అనుకున్నప్పుడు పని పూర్తి కాలేదనే అసంతృప్తితో పాటు, దాన్ని ఎలా కొనసాగించాలనే స్పష్టత కూడా వస్తుంది.
ఈరోజు నాకు గుర్తుండిపోయిన చిన్న విషయం
ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకునే పెద్ద సంఘటన ఏమీ జరగలేదు.
ఉదయం పెద్దగా ఉత్సాహం లేకుండా మొదలైన రోజు, మామూలు పనులతోనే గడిచిపోయింది.
కానీ సాయంత్రానికి ఒక విషయం మాత్రం నాకు స్పష్టంగా అనిపించింది.
ఈరోజు నేను ఏం చేయలేకపోయాను? అని మాత్రమే కాకుండా, ఈరోజు నేను ఏం చేశాను? అని కూడా అడగాలి.
మొదటి ప్రశ్న మనకు మిగిలిన పనులను గుర్తుచేస్తుంది. రెండో ప్రశ్న మనం పెట్టిన ప్రయత్నాన్ని గుర్తుచేస్తుంది.
రెండూ అవసరమే.
ఈరోజు నాకు అనుకున్నంత పని పూర్తికాలేదు. కానీ నా రోజంతా విలువలేనిదిగా కూడా గడవలేదు.
అది అర్థమైనందుకే, మామూలుగా గడిచిపోయిన ఈ రోజు A Normal Day నాకు ఒక చిన్న గుర్తుగా మిగిలింది.
ఈరోజు నేను చాలా పెద్ద achievement సాధించకపోయినా, నా ప్రయాణం మాత్రం ఆగలేదు.
బహుశా… కొన్ని రోజులకు అంతకంటే ఎక్కువ అవసరం కూడా ఉండకపోవచ్చు.
ఒక్క చిన్న అడుగు అయినా ముందుకు పడితే… అది కూడా ఒక ముందడుగే.
మీకు నా గురించి అంటే నా గురించి మాత్రమే కాదు ప్రతి మహిళ ఆలోచనలు తెలుసుకోవాలంటే ఇక్కడ My Thoughts అనే post లో రాశాను.
