మిక్సీలో మెత్తటి ఇడ్లీలు ఎలా తయారు చేయాలి? | Soft Idli Recipe Using Mixie
Affiliate Disclosure: ఈ articleలో Amazon affiliate links ఉన్నాయి. వాటి ద్వారా మీరు కొనుగోలు చేస్తే మాకు చిన్న commission రావచ్చు.
As an Amazon Associate I earn from qualifying purchases.
Soft idli kosam ఇడ్లీ పిండి గ్రైండర్లో కాకుండా మిక్సీలో తయారు చేస్తే ఇడ్లీలు గట్టిగా వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ మిక్సీలో కూడా మెత్తటి ఇడ్లీలు చేసుకోవచ్చు. అందుకు మినప్పప్పును సరిగ్గా నానబెట్టడం, మిక్సీలో పిండి ఎక్కువ వేడెక్కకుండా చూసుకోవడం, ఇడ్లీ రవ్వను సరైన విధంగా కలపడం ముఖ్యం.
ఈ పద్ధతిలో 1 కప్పు మినప్పప్పుకు 2 కప్పుల ఇడ్లీ రవ్వ ఉపయోగిస్తాం. మిక్సీలో పప్పు రుబ్బేటప్పుడు ఫ్రిజ్‌లో చల్లబరిచిన నీటిని వాడతాం. పిండిలో soda, baking powder లాంటివి కలపాల్సిన అవసరం లేదు.
Soft idli రావడానికి ఈ పద్ధతిని మొదటి నుంచి ఎలా పాటించాలో చూద్దాం.
Jump to Ingredients | Jump to Method | Jump to Tips
మిక్సీ లో ఇడ్లీకి కావలసిన పదార్థాలు
- మినప్పప్పు: 1 కప్పు
- ఇడ్లీ రవ్వ: 2 కప్పులు
- ఫ్రిజ్‌లో చల్లబరిచిన తాగునీరు: పప్పు రుబ్బడానికి అవసరమైనంత
- ఉప్పు: రుచికి సరిపడా
- ఇడ్లీ రేకులకు రాయడానికి కొద్దిగా నూనె లేదా నెయ్యి: అవసరమైతే
గమనిక: ఇక్కడ ఉపయోగించేది బియ్యంతో తయారైన ఇడ్లీ రవ్వ (Rice Rava). ఉప్మా కోసం ఉపయోగించే బాంబే రవ్వ కాదు. రెండు పదార్థాలు ఒకేలా ఉండవు.
మిక్సీలో ఇడ్లీ పిండి తయారు చేసే విధానం | Soft Idli Method
1. మినప్పప్పు, ఇడ్లీ రవ్వ నానబెట్టడం
ముందుగా ఒక కప్పు మినప్పప్పును తీసుకుని 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి.
పప్పు నానిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, నీటిని వంపేయాలి.
ఇడ్లీ రవ్వను మాత్రం పప్పు రుబ్బడానికి సుమారు ఒక గంట ముందు శుభ్రంగా కడిగి, తగినంత నీటిలో నానబెట్టాలి.
ఇలా రెండు పదార్థాలను విడివిడిగా సిద్ధం చేసుకుంటే పిండి తయారీ సులభంగా ఉంటుంది.
2. మినప్పప్పును మిక్సీలో రుబ్బడం
నానబెట్టిన మినప్పప్పును మిక్సీ జార్లో వేసుకోవాలి.
సాధారణ నీటికి బదులుగా ఫ్రిజ్‌లో చల్లబరిచిన నీటిని కొద్దికొద్దిగా పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి.
చల్లటి నీరు ఎందుకు ఉపయోగించాలి?
మిక్సీ (affiliate links)ఎక్కువసేపు తిరిగినప్పుడు జార్‌తో పాటు అందులోని పిండి కూడా వేడెక్కవచ్చు. చల్లటి నీరు ఉపయోగించడం వల్ల ఈ వేడిని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
పిండి మెత్తగా రుబ్బుకోవాలి. అయితే అవసరానికి మించి నీళ్లు పోసి పలుచగా చేసుకోకూడదు.
మినప్పిండి సిద్ధమైన తర్వాత ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి.
3. ఇడ్లీ రవ్వ కలపడం
ఇప్పటికే నానబెట్టిన ఇడ్లీ రవ్వలోని నీటిని పూర్తిగా వంపేయాలి.
రవ్వను చేతితో పిండి, అదనపు నీరు తీసేసి మినప్పిండిలో కలపాలి.
ఇప్పుడు మినప్పిండి, ఇడ్లీ రవ్వ రెండూ ఒకదానితో ఒకటి బాగా కలిసేలా కలుపుకోవాలి.
పిండి మరీ నీళ్లలా పలుచగా కాకుండా, ఇడ్లీ రేకుల్లో పోయడానికి అనువైన గట్టిదనంలో ఉండాలి.
ఈ పద్ధతిలో ఇడ్లీ రవ్వను విడిగా మిక్సీలో రుబ్బాల్సిన అవసరం లేదు.
4. పిండిని పులియబెట్టడం
కలిపిన పిండిని తగినంత ఖాళీ స్థలం ఉన్న శుభ్రమైన పాత్రలో ఉంచి, మూత పెట్టి పులియబెట్టుకోవాలి.
ఈ పద్ధతిలో సుమారు 6 గంటల తర్వాత పిండి బాగా పొంగింది. అయితే ప్రతి ఇంట్లోనూ అంతే సమయంలో పిండి పొంగుతుందని చెప్పలేం. వాతావరణం చల్లగా ఉంటే రాత్రంతా లేదా మరికొంత సమయం పట్టవచ్చు.
పిండి సరిగ్గా పులిసినప్పుడు దాని పరిమాణం పెరిగి, లోపల చిన్న చిన్న గాలి బుడగలు ఏర్పడతాయి.

ఈ లక్షణాలను పరిశీలించిన తర్వాత ఇడ్లీలు తయారు చేసుకోవాలి.
ఈ recipeలో ఉప్పును fermentation పూర్తయిన తర్వాత కలుపుతాం. పిండి పొంగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇడ్లీ రేకుల్లో పిండి పోయడం
ఇడ్లీ రేకులను కొద్దిగా నీటితో తడిపి సిద్ధం చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసుకోవచ్చు.
ఇప్పుడు సిద్ధమైన పిండిని ఒక్కో ఇడ్లీ గుంటలో పోయాలి.
రేకుల్లో పిండి పోయడానికి ముందే ఇడ్లీ పాత్ర (affiliate links)లో సరిపడా నీళ్లు పోసి స్టవ్‌పై వేడి చేయాలి.
6. ఇడ్లీలను ఆవిరిపై ఉడికించడం
ఇడ్లీ పాత్రలో నీళ్లు మరిగడం ప్రారంభమైన తర్వాత పిండి పోసిన ఇడ్లీ రేకులను అందులో అమర్చాలి.
ఈ పద్ధతిలో ఇడ్లీలను ఇలా ఉడికించాం:
- మొదట 10 నిమిషాలు ఎక్కువ మంటపై ఆవిరితో ఉడికించాలి.
- తర్వాత మంట తగ్గించి మరో 5 నిమిషాలు ఉడికించాలి.
- స్టవ్ ఆపేసి, ఇడ్లీ పాత్రను మరో 10 నిమిషాలు అలాగే ఉంచాలి.

ఆ తర్వాత జాగ్రత్తగా మూత తీసి, ఇడ్లీలను రేకుల నుంచి వేరు చేసుకోవాలి.
ఈ సమయాలు ఈ పద్ధతిలో ఉపయోగించినవి. ఇడ్లీ పాత్ర, స్టవ్ మంట, ఇడ్లీల పరిమాణాన్ని బట్టి ఉడికే సమయం మారవచ్చు. ఇడ్లీ మధ్య భాగం కూడా పూర్తిగా ఉడికిందో పరిశీలించాలి. ఎక్కువ మంటపై ఉడికించేటప్పుడు పాత్రలో నీరు పూర్తిగా అయిపోకుండా జాగ్రత్తపడాలి.
ఇలా తయారైన soft idli చాలా బాగుంటాయి. వేడివేడిగా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ లేదా సాంబార్‌తో వడ్డించుకోవచ్చు.
మిక్సీలో ఇడ్లీలు చేసేటప్పుడు చేయకూడని పొరపాట్లు
పప్పు రుబ్బేటప్పుడు ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు పోయకండి. పిండి పలుచగా మారితే ఇడ్లీల textureపై ప్రభావం పడవచ్చు.
మిక్సీ జార్‌ను మరీ నింపకండి. పప్పు ఎక్కువగా ఉంటే జార్ సామర్థ్యానికి తగ్గట్టుగా విడతలుగా రుబ్బుకోవాలి. జార్ బాగా వేడెక్కుతుంటే కొద్దిసేపు ఆపి మళ్లీ రుబ్బుకోవచ్చు.
పిండి పొంగకముందే కేవలం సమయం అయిందని ఇడ్లీలు పెట్టకండి. పిండి పరిస్థితిని కూడా పరిశీలించాలి.
ఇడ్లీలను అవసరానికి మించి ఆవిరిపై ఉడికించకండి. ఎక్కువసేపు ఉడికించడం వల్ల అవి పొడిగా లేదా గట్టిగా మారవచ్చు soft idli లు రావు.
Indian Spice Soul Tips
- కొలతలకు ఒకే కప్పు ఉపయోగించండి: మినప్పప్పు, ఇడ్లీ రవ్వ రెండింటినీ ఒకే కప్పుతో కొలవడం వల్ల 1:2 నిష్పత్తిని సరిగ్గా పాటించవచ్చు.
- పిండి పొంగడానికి పాత్రలో స్థలం ఉండాలి: Fermentation సమయంలో పిండి పరిమాణం పెరుగుతుంది. అందుకే పాత్రను అంచుల వరకు నింపకుండా ఖాళీ ఉంచండి.
- పిండి మొదటి స్థాయిని గుర్తించండి: పిండి కలిపిన వెంటనే పాత్ర బయట దాని ఎత్తును గుర్తుగా పెట్టుకుంటే, తర్వాత ఎంత పొంగిందో పోల్చుకోవడం సులభమవుతుంది.
- చాలా వేడి వాతావరణంలో నానబెట్టే విధానంపై శ్రద్ధ పెట్టండి: ఎక్కువసేపు నానబెట్టే మినప్పప్పును శుభ్రమైన తాగునీటితో, అవసరమైతే ఫ్రిజ్‌లో నానబెట్టడం మంచి food-safety precaution.
- మిగిలిన పిండిని సరిగ్గా నిల్వ చేయండి: Fermentation పూర్తయిన తర్వాత వెంటనే ఉపయోగించని పిండిని శుభ్రమైన మూత ఉన్న పాత్రలో ఫ్రిజ్‌లో ఉంచండి. అసాధారణ దుర్వాసన, బూజు లేదా పాడైన లక్షణాలు కనిపిస్తే ఉపయోగించవద్దు.
మిక్సీతో ఇడ్లీలు చేసేటప్పుడు ముఖ్యమైనది చల్లటి నీరు ఒక్కటే కాదు. సరైన పదార్థాల నిష్పత్తి, మినప్పప్పు texture, పిండి పులిసిన తీరు, ఆవిరిపై ఉడికించే విధానం అన్నీ కలిసి soft idli వచ్చేలా చేస్తాయి.
ఇంట్లో దోశ పిండి కూడా తయారు చేసుకోవాలనుకుంటే, మా Dosa Batter Recipe in Telugu కూడా చదవవచ్చు. దోశ పిండి తయారీకి ఉపయోగించే పదార్థాలు, నిష్పత్తులు ఈ ఇడ్లీ పద్ధతికి వేరుగా ఉంటాయి.
ఇడ్లీ పిండి పొంగడం లేదా?
ఇడ్లీ పిండి సరిగ్గా పొంగకపోతే ఇడ్లీలు మెత్తగా రావడం కష్టమవుతుంది. పిండి ఎందుకు పొంగడం లేదో, అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకోవడానికి మా ఇడ్లీ పిండి పొంగడం లేదా? కారణాలు, పరిష్కారాలు అనే article చదవండి.
మిక్సీలో మెత్తటి ఇడ్లీలు తయారు చేసే విధానం వీడియోలో చూడండి
మిక్సీలో మినప్పప్పు రుబ్బడం, ఇడ్లీ రవ్వ కలపడం, పిండి పొంగిన తీరు, ఇడ్లీలు ఆవిరిపై ఉడికించే విధానం ప్రత్యక్షంగా చూడాలనుకుంటే మా Soft Idli video చూడండి.
