చిట్టి ఉండ్రాళ్లు | Chitti Undrallu Recipe | పగలకుండా చక్కగా రావడానికి ముఖ్యమైన Tips

చిట్టి ఉండ్రాళ్లు ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరియు ఉపయోగకరమైన టిప్స్‌తో ఈ రెసిపీలో తెలుసుకోండి.

వినాయక చవితి సందర్భంగా చేసే సంప్రదాయ వంటకాలలో ఉండ్రాళ్లు ప్రత్యేకమైనవి. బియ్యం రవ్వతో సింపుల్‌గా తయారయ్యే ఈ చిట్టి ఉండ్రాళ్లు మెత్తగా, పగలకుండా రావాలంటే బియ్యం రవ్వ తయారుచేసుకునేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

ఈ పద్ధతిలో చిన్న సైజులో చిట్టి ఉండ్రాళ్లు తయారుచేసుకోవచ్చు. కావాలంటే ఇదే పద్ధతిలో సాధారణ సైజులో ఉండ్రాళ్లు కూడా చేసుకోవచ్చు. వీటిని కుడుములు అని కూడా అంటారు

కావలసిన పదార్థాలు

  • బియ్యం రవ్వ – 1 కప్పు
  • శనగపప్పు – 2 స్పూన్లు
  • నీళ్లు – 2 కప్పులు
  • జీలకర్ర – ½ స్పూన్
  • ఉప్పు – సరిపడా
  • నెయ్యి – చేతికి రాసుకోవడానికి కొద్దిగా

ముందుగా శనగపప్పు నానబెట్టుకోవడం

శనగపప్పును శుభ్రంగా కడిగి సుమారు 2 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టడం వల్ల శనగపప్పు త్వరగా ఉడుకుతుంది.

నేను 1 కప్పు బియ్యం రవ్వకు 2 స్పూన్ల శనగపప్పు ఉపయోగించాను. శనగపప్పు ఎక్కువగా కావాలనుకుంటే మీ ఇష్టానికి అనుగుణంగా quantity పెంచుకోవచ్చు.

బియ్యం రవ్వ ఇంట్లో తయారుచేసుకునే విధానం

బియ్యాన్ని శుభ్రంగా కడిగి సుమారు 6 గంటలు నానబెట్టుకోవాలి.

తర్వాత నీటిని పూర్తిగా వంపేసి, బియ్యాన్ని శుభ్రమైన క్లాత్ మీద వేసి అరగంట సేపు ఆరబెట్టాలి.

ఆరిన బియ్యాన్ని మిక్సీలో వేసి రవ్వలా చేసుకోవాలి.

బియ్యాన్ని మిక్సీలో రవ్వగా చేసుకున్న తర్వాత అందులో వచ్చిన మెత్తటి బియ్యం పిండిని జల్లించి తీసేయకండి.

రవ్వతో పాటు కొంచెం పిండి కూడా అలాగే ఉండనివ్వాలి. ఆ పిండి ఉండటం వల్ల ఉండ్రాళ్లు చేసేటప్పుడు అవి పగలకుండా చక్కగా రావడానికి సహాయపడుతుంది.

షాప్‌లో కొన్న బియ్యం రవ్వను ఉపయోగిస్తుంటే, దానిని మిక్సీలో వేసి కొద్దిగా fineగా grind చేసుకోవచ్చు. అప్పుడు రవ్వతో పాటు కొంచెం మెత్తటి పిండి కూడా వస్తుంది.

చిట్టి ఉండ్రాళ్లు తయారుచేసే విధానం

ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి 2 కప్పుల నీళ్లు పోయాలి.

అందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు వేసి ఉడికించాలి.

senagapappu udakabettadam

శనగపప్పు ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న 1 కప్పు బియ్యం రవ్వ వేసి బాగా కలపాలి.

స్టవ్‌ను సిమ్‌లో పెట్టి, గిన్నెకు మూత పెట్టి రవ్వ చక్కగా ఉడికే వరకు ఉంచాలి.

రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఉండ్రాళ్లు చేసుకోవచ్చు లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడే కూడా చేసుకోవచ్చు.

ravva udikindhi

ఉండ్రాళ్లు చేసుకోవడం

చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మిశ్రమం చేతులకు ఎక్కువగా అతుక్కోకుండా ఉంటుంది.

ఉడికించిన రవ్వ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని మనకు నచ్చిన సైజులో ఉండ్రాళ్లుగా చేసుకోవాలి.

సాధారణ ఉండ్రాళ్లు కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. చిట్టి ఉండ్రాళ్లు కావాలంటే చిన్న చిన్న సైజులో చేసుకోవాలి.

kudumulu udakabettadam

ఆవిరిపై ఉడికించడం

తయారుచేసుకున్న చిట్టి ఉండ్రాళ్లను ఇడ్లీ ప్లేట్ లేదా స్టీమర్ ప్లేట్‌లో పెట్టుకోవాలి.

ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి high flame మీద సుమారు 5 నిమిషాలు steam చేయాలి. ఎక్కువసేపు steam చేయాల్సిన అవసరం లేదు.

ఉండ్రాళ్లు ఎక్కువ quantityలో ఉంటే multiple steamer platesలో పెట్టి ఒకదానిపై మరొకటి అమర్చుకుని కూడా steam చేసుకోవచ్చు.

5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత బయటకు తీసుకోవచ్చు.

అంతే, మెత్తగా రుచిగా ఉండే చిట్టి ఉండ్రాళ్లు సిద్ధం.

kudumulu or undrallu ready

ఎలా సర్వ్ చేసుకోవచ్చు?

వేడి వేడిగా ఉన్న చిట్టి ఉండ్రాళ్లను అలాగే తిన్నా కమ్మగా ఉంటాయి. కొబ్బరి చట్నీతో కలిపి తింటే breakfastగా కూడా బాగుంటాయి.

వినాయక చవితి సమయంలో నైవేద్యంగా తయారుచేసుకోవడంతో పాటు, కావాలనుకుంటే సాధారణ రోజుల్లో breakfastగా కూడా చేసుకోవచ్చు.

అంతే! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకున్న చిట్టి ఉండ్రాళ్లు రెడీ.

Tips:

⭐ పాత బియ్యంతో తయారుచేసిన రవ్వను ఉపయోగిస్తుంటే నీళ్లు కొంచెం ఎక్కువ అంటే 1 కప్పు రవ్వకు 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి

⭐ బియ్యం రవ్వ వేయించుకుంటే కుడుములు కమ్మగా బాగుంటాయి

⭐ బియ్యం రవ్వను ఇంట్లో తయారుచేసేటప్పుడు పూర్తిగా మెత్తటి పిండిలా చేయకండి.

కొంచెం రవ్వతో పాటు కొంచెం పిండి కూడా ఉండేలా చేసుకోవాలి.

ఇలా చేసుకుంటే ఉండ్రాళ్లు తయారుచేసేటప్పుడు పగలకుండా చక్కగా వస్తాయి.

ఉండ్రాళ్ళు చేసేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని చేస్తే చేతికి రవ్వ అతుక్కోకుండా ఉంటుంది అలాగే మంచి shape లో కూడా వస్తాయి.

మీకు ఈ రెసిపీ నచ్చిందా?

ఈ రెసిపీ Video చూడాలనుకుంటే కింద ఉన్న YouTube Videoను చూడండి.

Indian Spice Soul – చిట్టి ఉండ్రాళ్లు

👉 https://youtu.be/HvbgWMbaIxI

ఈ చిట్టి ఉండ్రాళ్ల రెసిపీ మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా ప్రయత్నించి చూడండి. మీరు ఎలా చేశారో, మీకు ఎలా వచ్చాయో కింద Commentsలో తెలియజేయండి.

ఈ రెసిపీ మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి.

ఇలాంటి మరిన్ని ఇంటి రుచులు, సంప్రదాయ వంటకాలు మరియు ఉపయోగకరమైన kitchen tips కోసం Indian Spice Soulను ఫాలో అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *